పాపం పవన్ కళ్యాణ్ అమాయకుడు: పోసాని

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కు వ్యక్తిత్వం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందాలని

By Medi Samrat  Published on  2 Oct 2023 5:30 PM IST
పాపం పవన్ కళ్యాణ్ అమాయకుడు: పోసాని

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కు వ్యక్తిత్వం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందాలని పోసాని కృష్ణమురళి సవాల్ చేశారు. సీఎం జగన్‌ వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కాబట్టే ఒంటరిగా పోటీ చేస్తాడని.. వైఎస్ జగన్‌కు కులం, మతం లేదన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడం మానేసి తనకు ఎన్ని సీట్లు వస్తాయో.. తనను గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తానో వివరిస్తే మంచిదని సూచించారు. పవన్‌ కళ్యాణ్ కనీసం కాపులకు అండగా ఉంటానని కూడా ఇప్పటి వరకు ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదన్నారు. పవన్ కళ్యాణ్ మైకంలోకి కాపులు వెళ్లొద్దని.. ఎవరు మంచి అభివృద్ధి చేస్తే వాళ్ళను గెలిపించాలని, ఇప్పటికే చాలాసార్లు నష్టపోయారని ఇక నష్టపోవద్దని కాపులకు పోసాని కృష్ణమురళి సూచించారు.

దుర్మార్గుడైన చంద్రబాబుకు సపోర్ట్ చేయకని పవన్ కళ్యాణ్ ను రిక్వెస్ట్ చేస్తున్నానన్నారు పోసాని. ఒక లైన్ తో జనాల్లోకి వెళితే చరిత్రలో నిలిచిపోతావన్నారు. మీ అన్న ఒక్క రూపాయి తీసుకోకుండా నాకు టికెట్ ఇచ్చారని పోసాని గుర్తు చేసుకున్నారు. నువ్వు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తావో చెప్పని పోసాని కృష్ణమురళి అన్నారు. అత్తకోడళ్లు ఇద్దరు కలిసి నిన్ను ఐస్ చేయగానే వాళ్లకి హామీలు ఇచ్చావని పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు పోసాని. పవన్ కళ్యాణ్ అమాయకుడు కాబట్టే భువనేశ్వరి, బ్రాహ్మణిలు జ్యూస్‌ ఇవ్వగానే టీడీపీకి మద్దతు ప్రకటించారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను ఒంటరి వాడిని చేసి, ఆయన్ను మోసం చేసి చావడానికి కారణం అయిన వాళ్లు దండం పెట్టగానే పవన్ కళ్యాణ్ అభయం ఇచ్చేశాడంటూ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారు.

Next Story