రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

మాక్ పోల్ అనంతరం రాష్ట్రంలో ఉదయం 7.00 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంద‌ని అధికారులు తెలిపారు

By Medi Samrat  Published on  13 May 2024 9:08 AM IST
రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

అమరావతి మే 13: మాక్ పోల్ అనంతరం రాష్ట్రంలో ఉదయం 7.00 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంద‌ని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలలో పట్టిష్టమైన పోలీసు భద్రత మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని వెల్ల‌డించారు. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ.. నైపుణ్యం గల BEL ఇంజనీర్ల సహకారంతో సెక్టర్ అధికారులు రిజర్వులో ఉన్న ఈవీఎంలను ఏర్పాటు చేయడంతో ఆయా పోలింగ్ స్టేషన్లలో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.

Next Story