త్వరలో రాజకీయ పార్టీ పెడతా: ఆనందయ్య

Political party for BCs soon .. Announced by Ayurvedic doctor Anandayya. తెలుగు రాష్ట్రాల్లో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అంటే తెలియని వారుండరు. తాజాగా ఆనందయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో

By అంజి  Published on  30 Nov 2021 8:51 AM IST
త్వరలో రాజకీయ పార్టీ పెడతా: ఆనందయ్య

తెలుగు రాష్ట్రాల్లో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అంటే తెలియని వారుండరు. తాజాగా ఆనందయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పార్టీ పెడతామని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అన్నారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెడతామని పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని ఆయన సోమవారం సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. ఆనందయ్య మీడియాతో మాట్లాడారు.

బీసీలను రాజకీయ పార్టీలు సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీసీ జేఏసీ ద్వారా రాజకీయ పార్టీ పెడతామని చెప్పారు. బీసీలకు న్యాయం చేసేందుకే పార్టీని స్థాపించబోతున్నట్లు ఆనందయ్య పేర్కొన్నారు. మరోవైపు ఒమ్రికాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు తన దగ్గర మందు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అందరికి మందు అందిస్తానని తెలిపారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా వైరస్‌కు మందు తయారు చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.

Next Story