కర్నూలు జిల్లా శ్రీశైలం పోలీసులు మరోసారి మానవత్వం చాటుకున్నారు. శ్రీశైలం భీముని కొలను వద్ద నట్టడవిలో ఊపిరాడక పడి ఉన్న భక్తున్ని శ్రీశైలం ఒన్ టౌన్ ఎస్సై హరి ప్రసాద్, పోలీసు సిబ్బంది కాపాడారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా బొమ్మనహల్లి గ్రామానికి చెందిన భక్తుడు నల్లమల అడవిలో తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరి ఆడక పడిపోగా గమనించిన కొందరు డయల్ 100కి కాల్ చేశారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన శ్రీశైలం పోలీసులు.. వెంటనే అక్కడికి ఆక్సిజన్, వైద్య సిబ్బందిని వెంటపెట్టుకొని వెళ్ళారు. అస్వస్థతకు గురైన వ్యక్తికి వైద్యం అందించి.. అతన్ని భుజాలపై ఎత్తుకొని కైలాస ద్వారం వరకు తీసుకొని వెళ్ళారు. అయితే.. దారి మధ్యలోనే భక్తుడు కోలుకోలేక మరణించాడని కైలాస ద్వారం వద్ద వైద్యులు నిర్ధారించారు. ఎంతో ప్ర‌య‌త్నించినా ప్రాణం ద‌క్క‌క‌పోవ‌డంతో పోలీసులు విచారం వ్య‌క్తం చేశారు.సామ్రాట్

Next Story