వైఎస్ వివేకా కుమార్తె ఇంటిముందు రెక్కీ నిర్వహించిన వ్యక్తి అరెస్ట్

Police Takes Action On Sunitha Reddy Complaint. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. సీబీఐ కేసు విచారిస్తున్న

By Medi Samrat
Published on : 14 Aug 2021 4:38 PM IST

వైఎస్ వివేకా కుమార్తె ఇంటిముందు రెక్కీ నిర్వహించిన వ్యక్తి అరెస్ట్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. సీబీఐ కేసు విచారిస్తున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుమార్తె సునీతారెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి తమ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడని ఆరోపిస్తూ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న ఆ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని, ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీతరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేశారు. దీంతో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు నిందితుడు మణికంఠారెడ్డి గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రెక్కీ నిర్వహించడానికి కారణాలు? ఫోన్లు ఎవరెవరికి చేశారు? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Next Story