కత్తి మహేష్ మరణంపై పోలీసు విచార‌ణ‌కు ఆదేశించిన ఏపీ ప్ర‌భుత్వం

Police Enquiry On Kathi Mahesh Death. దివంగ‌త‌ ఫిలిం క్రిటిక్‌ కత్తి మహేష్ మరణం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రెండు వారాల క్రితం

By Medi Samrat  Published on  14 July 2021 3:30 PM IST
కత్తి మహేష్ మరణంపై పోలీసు విచార‌ణ‌కు ఆదేశించిన ఏపీ ప్ర‌భుత్వం

దివంగ‌త‌ సీనీ విమ‌ర్శ‌కుడు కత్తి మహేష్ మరణం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రెండు వారాల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురై.. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్ర‌మాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతని డ్రైవర్‌కు మాత్రం పెద్దగా గాయాలు కాలేదు. దీంతో క‌త్తి మ‌హేష్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన ఎమ్మార్పీఎస్ అధ్య‌క్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ.. మహేష్ మరణం వెనుక కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. మ‌హేశ్ మ‌ర‌ణంపై సిట్టింగ్ జ‌డ్జితో విచారణ జ‌రిపించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.


అలాగే.. కత్తి మహేష్ తండ్రి ఓబులేషు కూడా మ‌హేష్ మ‌ర‌ణంపై అనుమానం వ్యక్తం చేశారు. మహేష్ మరణం గురించి ఆసుపత్రి వ‌ర్గాలు ముందుగా తమకు తెలియజేయాలని.. కానీ వారు అలా చేయకుండా నేరుగా వార్తలను మీడియాకు విడుదల చేశారని అన్నారు. కాగా.. మంద కృష్ణ చేసిన అభ్యర్థనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఈ విషయంపై పోలీసు విచారణకు ఆదేశించింది. ఈ నేఫ‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మ‌హేశ్ కారు డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


Next Story