విశాఖ RUF ప్రాజెక్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ శుద్ధి కర్మాగారంలో అవశేషాల అప్‌గ్రేడేషన్ సౌకర్యాన్ని ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.

By -  Knakam Karthik
Published on : 6 Jan 2026 3:23 PM IST

Andrapradesh, Visakhapatnam, Residue Upgradation Facility, PM Modi

విశాఖ RUF ప్రాజెక్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ శుద్ధి కర్మాగారంలో అవశేషాల అప్‌గ్రేడేషన్ సౌకర్యాన్ని ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. విశాఖ రిఫైనరీలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అవశేషాల అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ (RUF) విజయవంతంగా ప్రారంభించబడటం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇంధన భద్రత , స్వావలంబన వైపు భారత్ ప్రయాణంలో ఇది ఒక నిర్ణయాత్మక ముందడుగు అని ఆయన అభివర్ణించారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా, ఇంధన పెంపొందించడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలకు ఈ అత్యాధునిక సౌకర్యం ఊతం ఇస్తుందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

అంతకుముందు ఈ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. ఇది దేశీయ ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమని కొనియాడారు. దాదాపు 2,200 మెట్రిక్ టన్నుల బరువున్న మూడు భారీ రియాక్టర్లను పూర్తిగా దేశీయంగానే తయారు చేసి, అసెంబుల్ చేశారని ఆయన వెల్లడించారు. 3.55 MMTPA సామర్థ్యం గల ఈ యూనిట్, అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ విలువైన ముడి చమురు అవశేషాలను 93 శాతం వరకు అధిక విలువైన ఉత్పత్తులుగా మారుస్తుందని తెలిపారు.

కాగా తూర్పు తీరంలో అత్యంత పురాతనమైన విశాఖ రిఫైనరీని 1956లో కాల్టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ ఇండియా 0.675 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభించింది. 1978 నుంచి ఇది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ యాజమాన్యంలో నడుస్తోంది.

Next Story