ఏలూరు వింత వ్యాధి.. కారణం అదే.. తేల్చేసిన నిపుణులు
Pesticide residue behind Eluru’s mystery illness. పశ్చిమగోదావరిలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపిన సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 17 Dec 2020 4:30 AM GMT
పశ్చిమగోదావరిలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వింత వ్యాధి వల్ల వందల మంది ఆస్పత్రి పాలైయ్యారు. అలాగే వారిలో కొద్దిమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎట్టకేలకు ఈ అంతుచిక్కని వ్యాధి గుట్టు వీడింది. దీనికి సంంధించిన రిపోర్టులను ఎయిమ్స్, ఇతర సంస్థలు ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి. పురుగుల మందుల అవశేషాలే ఏలూరు వ్యాధికి కారణమని స్పష్టం చేశాయి.
ఏలూరు ఘటనపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో ఢిల్లీ ఎయిమ్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ (ఎన్ఐసీటీ) సహా ప్రముఖ పరిశోధనా సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. అయితే.. మానవ శరీరంలోకి పురుగుల మందు అవశేషాలు ఎలా ప్రవేశించాయన్న దానిపై సమగ్ర అధ్యయనం అవసరం అని నిపుణులు తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ఢీల్లి ఎయిమ్స్, ఎన్ఐసీటీకి అధ్యయన బాధ్యతలను అప్పగించారు.
క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని.. ప్రతి జిల్లాలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలన్నారు. దాని ఫలితాల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకి తెలిపారు. ఏలూరు లాంటి ఘటనలు మరోచోట జరగకూడదన్నారు. మరోవైపు ఆర్బీకేల ద్వారా సేంద్రీయ ఎరువులతో వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన పెంచాలని సీఎం వైస్ జగన్ సూచించారు.