పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసింది అతడే

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ రావడంతో కలకలం రేగిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  10 Dec 2024 6:12 PM IST
పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసింది అతడే

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ రావడంతో కలకలం రేగిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ ను చంపేస్తానని బెదిరించడం, ఆయన కార్యాలయానికి అభ్యంతరకరమైన పదజాలంతో బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజ్ లు పంపడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది.

ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని నూక మల్లికార్జున్ అని గుర్తించి, అతడిని అరెస్టు చేశారు. మల్లికార్జున్‌కు మానసిక సమస్యలు ఉన్నాయని, మద్యం మత్తులో కాల్‌లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని విజయవాడ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో విశాఖపట్నంలో మల్లికార్జున్‌పై సెక్షన్ 354 కింద కేసు నమోదైంది.

Next Story