విశాఖపట్టణంలో మంత్రుల కాన్వాయ్ ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని మంత్రుల కాన్వాయ్‌లోని ఓ వాహనం లైట్‌గా బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న అతడు కింద పడిపోయాడు. అదే సమయంలో వెనుకాలే వస్తున్న మరో వాహనం అతనిపై నుంచి వెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న సూర్యానారాయణ మంగళవారం మధ్యాహ్నం పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బిర్లా జంక్షన్ వద్ద ప్రమాదం జరిగింది. కాన్వాయ్ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు విజయనగరం జిల్లా గణపతినగరంకు చెందిన సూర్యానారయణ. మృతుడికి భార్య వరలక్ష్మీ, ఇంటర్ చదువుతున్న ఇద్దరు కుమార్తెలు నందిని, ఉష, కుమారుడు వంశీ ఉన్నారు. ఉన్నారని పోలీసులు తెలిపారు. సూర్యానారయణ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిముందు ఆందోళనకు దిగారు. మంత్రిని కలిసి న్యాయం చేయాలని వారు కోరగా.. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.