బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు

చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని పేర్ని నాని అన్నారు.

By Medi Samrat  Published on  4 April 2024 9:00 PM IST
బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు

చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని పేర్ని నాని అన్నారు. పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కంటే చెల్లెలి భర్తకు మేలు చేసేలా పని చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్‌ను కూలదోసే సమయంలో బాబుకు పురంధేశ్వరి మద్దతు ఇచ్చారని, బాబు కోసం పురంధ్వేశ్వరి బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని అన్నారు. ఏపీలో బీజేపీలో బలం ఉందా లేదా అనే విషయం అందరికీ తెలుసన్నారు.

బీజేపీ టికెట్లను పురంధేశ్వరి ఎవరికి ఇప్పించారో చూస్తూనే ఉన్నామని.. బీజేపీలో ఒరిజినల్‌ నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని అన్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారంతా టీడీపీ నేతలనేనని అన్నారు. ఎవరిని ఎక్కడికి ట్రాన్స్‌ఫర్‌ చేయాలో పురంధేశ్వరి ఈసీకి లిస్ట్‌ ఇచ్చారు. బదిలీ చేసిన వారి స్థానంలో ఎవరిని నియమించాలో కూడా పేర్లు ఇచ్చారన్నారు. పురంధేశ్వరి కావాలనుకున్న అధికారులకు ఎంత ఇచ్చారో చెప్పాలి. నిజాయితీగా పని చేసిన ఐపీఎస్ అధికారులపై విషం చిమ్మడం దారుణమన్నారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేసిన పురంధేశ్వరి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

Next Story