వంటగ్యాస్ లభ్యతపై ప్రజలు ఆందోళన చెందొద్దు

మధ్యప్రాశ్చ్యంలో యుద్ధవాతావరణ నేపథ్యంలో గ్యాస్ లభ్యతలో అసమానతలు పెరిగాయని అయితే వంట గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.

By -  Medi Samrat
Published on : 23 March 2026 5:51 PM IST

వంటగ్యాస్ లభ్యతపై ప్రజలు ఆందోళన చెందొద్దు

మధ్యప్రాశ్చ్యంలో యుద్ధవాతావరణ నేపథ్యంలో గ్యాస్ లభ్యతలో అసమానతలు పెరిగాయని అయితే వంట గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అంశాలపై దిశానిర్దేశం చేసిన వివరాలను మంత్రి పార్థసారథి ఏపీ సచివాలయం ప్రచార విభాగంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భాంగా మంత్రి మాట్లాడుతూ గ్యాస్ కొరతను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలైన ఇండక్షన్ స్టవ్ లు, పైప్ లైన్ గ్యాస్ కనెక్షన్లు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేంశం చేశారన్నారు. ఇండక్షన్ స్టవ్ లను వాడేలా చేయడం,కంపెనీలు వాటి ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. పైప్ లైన్ గ్యాస్ సరఫరా విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పైప్ లైన్ గ్యాస్ కోసం పైప్ లైన్ల ఏర్పాటుకు నిబంధనల పాటిస్తూ 24 గంటల్లో అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారన్నారు. ఎందుకంటే పైప్ లైన్ గ్యాస్ సరఫరాకు తక్కువ వ్యయం అవుతుందని,కాలుష్యం కూడా తగ్గుతుందని, సిలిండర్ గ్యాస్ తో పోల్చితే ధర కూడా తక్కువ ఉంటుందని వివరించారు.రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నా మని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముందుగానే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ((AI)టూల్స్ ద్వారా 57 రకాల అప్డేట్స్ ఇచ్చామని దీంతో రైతులు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడంతో నష్టం తీవ్రత తగ్గిపోయిందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.ఉదాహరణకు మిర్చి కళ్లాల్లో ఆరబెట్టిన రైతాంగం మెసేజ్ అలెర్ట్ ల ద్వారా జాగ్రత్తపడి టార్బాలిన్ పట్టాలు కప్పి మిర్చి తడిచిపోకుండా కాపాడుకోగలిగారన్నారు.అలాగే హర్వేస్ట్ కూడా వేగంగా చేసి గోదాములకు సరుకును తరలించడంతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు.అకాల వర్షాల పంటనష్టం అంచనాలను ఈనెల 26 నాటికి పూర్తి ఆవివరాలను ఈనెల 27 నుండి 29 వరకూ రైతు సేవా కేంద్రాల్లో డిస్ప్లే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.ఈనెల 31 నాటికి పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలని జిల్లా కలక్టర్లను సియం ఆదేశించినట్టు వివరించారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధమిక సమాచారం మేరకు 13 వేల మంది వ్యవసాయ రైతులు,1800 మంది ఉద్యానవన రైతులు అకాల వర్షాలతో నష్ట పోయారని తెలుస్తోందని,9981 హెక్టార్లలో వ్యవసాయ,1381 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం జరిగిందన్నారు.పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పార్ధసారధి స్పష్టం చేశారు.

మొక్క జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు.రాష్ట్రంలో పంట దిగుబడి పెరగటం,ఇథనాల్ ప్యాక్టరీలు మొక్కజొన్న కొనుగోళ్లు తగ్గించడం వంటి కారణాలతో ధర తగ్గిందన్నారు.మొక్క జొన్న రైతులకు న్యాయం జరిగేలా కేంద్రం నుంచి నష్ట పరిహారం రాబట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.

ఐవీఆర్ ఎస్ ద్వారా శాఖల పనితీరును అంచనా వేస్తూ నివేదికలు సిద్దం చేస్తున్నామని మంత్రి పార్థసారథి చెప్పారు.సాంకేతికతను వినియోగించి ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారించేలా ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సీఎం ఆదేశించారన్నారు.వాట్సప్ గవర్నెన్స్ ను ఎక్కువగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సాంకేతికత సాయంతో పుణ్యక్షేత్రాల్లో ఎక్కువ మంది దర్శనాలు చేసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు.ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్ లో 1000 వరకూ సేవలు అందుబాటులో ఉంచామని ప్రజలు వాట్సప్ గవర్నెన్స్ సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకోసం 10 లక్షల వరకు దరఖాస్తులు అందాయని వాటిలో 6.5లక్షల నుండి 7 లక్షల వరకు ధరఖాస్తులు అర్హత కల్గినవిగా అధికారులు గుర్తించారని మంత్రి పార్థసారథి తెలిపారు.పీఎంఎవై 2.0 పథకంలో భాగంగా ఇళ్లు లేని వారికి ఇళ్లు మంజూరు చేస్తామని హామి ఇచ్చారు.పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పార్థసారథి తెలిపారు.

Next Story