అవే చంద్రబాబుకు చివ‌రి ఎన్నిక‌లు

Peddireddy Ramachandra Reddy takes dig at Chandrababu, says 2024 elections are last for him. అనంతపురం జిల్లాలో సామాజిక న్యాయ భేరి విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ మంత్రి

By Medi Samrat
Published on : 31 May 2022 5:36 PM IST

అవే చంద్రబాబుకు చివ‌రి ఎన్నిక‌లు

అనంతపురం జిల్లాలో సామాజిక న్యాయ భేరి విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సామాజిక న్యాయ భేరి సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చాయ‌న్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపారు.

కుప్పంలో మైనింగ్ మాఫియాపై చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపడ్డారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి అన్నారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వెనుకబడిన తరగతుల ప్రజలకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్సార్‌సీపీ పదిహేడు మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులతో సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.














Next Story