ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థికమంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు.

By Medi Samrat  Published on  11 July 2024 12:08 PM IST
ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్

రాష్ట్ర ఆర్థిక,ప్రణాళిక,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ గురువారం రాష్ట్ర సచివాలయం రెండవ భవనంలోని చాంబరులో ప్రవేశించి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శులు డా.కెవివి. సత్యనారాయణ,జానకి,వినయ్ చంద్,చీఫ్ కమీషనర్ స్టేట్ ట్యాక్సెస్ గిరిజా శంకర్,ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరి కె.ఆదినారాయణ,డైరెక్టర్ ట్రెజరీస్ మోహన్ రావు,ఇతర అధికారులు,పలువురు,ఎపిజిఎల్ఐ డైరెక్టర్ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story