ఎన్నికల సమరానికి 'వారాహి' ని సిద్ధం చేసిన ప‌వ‌న్‌

Pawan Kalyan's Varahi is ready for the Election Campaign. 2024 అసెంబ్లీ జనరల్ ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

By Medi Samrat  Published on  7 Dec 2022 1:47 PM GMT
ఎన్నికల సమరానికి వారాహి ని సిద్ధం చేసిన ప‌వ‌న్‌

2024 అసెంబ్లీ జనరల్ ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బస్సు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు బస్సుయాత్ర చేసిన వివిధ పార్టీల నేతలు ప్రయాణించిన బస్సులకు భిన్నంగా ఈ బస్సును రూపొందించారు. ఆర్మీ ట్రక్కును టూర్ బస్సుగా మార్చారు. మూడు నెలల పాటు శ్రమించి ప్రత్యేకంగా బస్సును రూపొందించారు. ఎన్నికల పోరుకు 'వారాహి' సిద్ధమైందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. బస్సు ఫొటోలను పవన్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వాహనానికి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించ‌న‌ట్లు తెలుస్తోంది. వాహనంపై ఎలాంటి నంబర్ కనిపించలేదు. ఎన్నికల యుద్ధానికి 'వారాహి' బస్సు సిద్ధమంటూ ప‌వ‌న్‌ వీడియో, ఫొటోలను పంచుకున్న వెంట‌నే నెట్టింట ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. జ‌న‌సైనికులు, ప‌వ‌న్ అభిమానులు షేర్ చేసుకుంటూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.



Next Story