ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని చెప్పారు. పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ మాట్లాడారని, అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారన్నారు.
పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి స్పందిస్తూ మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. మార్క్ శంకర్ ను చూసేందుకు చిరంజీవి, ఆయన భార్య సురేఖ సింగపూర్ కి వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ కూడా సింగపూర్ కి వెళుతున్నారు.