అల్లూరి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన‌ పవన్ కళ్యాణ్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్నారు.

By Medi Samrat
Published on : 7 April 2025 10:03 AM IST

అల్లూరి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన‌ పవన్ కళ్యాణ్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా డుంబ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి బయలుదేరారు. గిరిజన గ్రామాల అభివృద్ధి నిమిత్తం చేప‌ట్టిన‌ “అడవి తల్లి బాట” కార్యక్రమానికి పెదపాడు గ్రామంలో పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడతారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కార్యక్రమ వివరాలు

ఉదయం 11 గం.కి: దుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామ సందర్శన. పివిటీజీ ప్రాంతాలను కలిపే రోడ్లకు శంకుస్థాపన. అనంతరం దుంబ్రిగూడ ఆశ్రమ పాఠశాలలో బహిరంగ సభ ఉంటుంది.

అంతకు ముందు విమానాశ్రయంలో ఆయ‌న‌కు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, యలమంచిలి శాసన సభ్యుడు సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పోరేషన్ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్, పార్టీ పీఏసీ సభ్యుడు కోన తాతారావు, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ నేతలు డాక్టర్ సందీప్ పంచకర్ల, పసుపులేటి ఉషాకిరణ్, బోడపాటి శివదత్, భీశెట్టి వసంత లక్ష్మి తదితరులు ఘన స్వాగతం పలికారు.

Next Story