ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమపై హాట్ కామెంట్స్ చేశారు.ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా ? సినీ పెద్దలు, అగ్రనటులను వైసీపీ ప్రభుత్వం ఎలా చూసిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మరిచిపోయారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు... సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు... సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే – తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు.
కాగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు విడుదలకు ముందు తమ డిమాండ్ల సాధనకు సినిమా థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబ్యూటర్లు నిర్మాతలను హెచ్చరించిన మేరకు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.