ఆమె పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి : పవన్ కళ్యాణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు.

By Medi Samrat  Published on  1 July 2024 8:45 PM IST
ఆమె పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి : పవన్ కళ్యాణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వానికి సరికొత్త డిమాండ్ చేశారు. డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని.. గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణగా, నిత్య అన్నదాతగా డొక్కా సీతమ్మ పేరుపొందారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ మహనీయురాలి సేవలను మనమంతా ప్రతి రోజూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని.. పిఠాపురం పేరు ప్రపంచస్థాయిలో వినిపించినప్పుడే తాను నెగ్గినట్టు భావిస్తానని అన్నారు.

ఇక జనసేన పార్టీ ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ లను అధికారిక విప్ లు గా నియమించాలని కోరుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. బొమ్మిడి నాయకర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నరసాపురం స్థానం నుంచి గెలుపొందారు. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.

Next Story