'హరి హర వీర మల్లు' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన నటించిన మూడు సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  23 Sept 2024 2:59 PM IST
హరి హర వీర మల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన నటించిన మూడు సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హరి హర వీర మల్లు (HHVM) సెట్స్ కు తిరిగి వచ్చారని తెలుస్తోంది. విజయవాడలోని ప్రత్యేక సెట్‌లో ఈరోజు ఉదయం 7 గంటలకు షూటింగ్ తిరిగి ప్రారంభమైందని చిత్ర నిర్మాణ బృందం ధృవీకరించింది.

ఇక హరి హర వీర మల్లు కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మార్చి 28, 2025న పలు భారతీయ భాషల్లో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు. కత్తి పట్టుకున్న పవన్ కళ్యాణ్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ అనే ఎపిక్ పీరియడ్ డ్రామాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించారు. ఇందులో బాబీ డియోల్, ఎం. నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి కూడా ఉన్నారు. ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ దయాకర్ రావు నిర్మించారు. మొదట క్రిష్ జాగర్లమూడి పలు కీలక సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు జ్యోతి కృష్ణ మిగిలిన భాగాన్ని చూసుకోనున్నారు.

Next Story