సినిమా షూటింగ్‌లు లేక రాజకీయాలు చేస్తున్నారు

Pawan Kalyan has no shootings and making politics in Vijayawada. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు సినిమా షూటింగ్‌లు లేవని, అందుకే టీడీపీ అధినేత

By Medi Samrat
Published on : 18 Oct 2022 4:42 PM IST

సినిమా షూటింగ్‌లు లేక రాజకీయాలు చేస్తున్నారు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు సినిమా షూటింగ్‌లు లేవని, అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడలో రాజకీయాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి జోగి రమేష్.. వైసీపీపై తీవ్ర‌ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు లేరని పవన్ కళ్యాణ్ ఏడ్చేస్తున్నారని, పొత్తులు లేకుండా జనసేన పోటీ చేస్తుందో లేదో చెప్పాలని సవాల్ విసిరారు. బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా పవన్ కల్యాణ్‌కు ఎలాంటి తేడా లేదన్నారు.

ఉత్తరాంధ్ర ప్రజలు తమ కలలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తోనే సాధ్యమని విశ్వసిస్తున్నారని.. అందుకే విశాఖ గర్జనను విజయవంతం చేశారని జోగి రమేష్ అన్నారు. ఇది తట్టుకోలేక జనసేన బ్యాచ్‌ సైకోలా ప్రవర్తించి మంత్రులపై దాడికి పాల్పడిందని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు హింసను ప్రోత్సహిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తత తీసుకున్నారని మండిపడ్డారు. సినిమాల్లో లాగా ఆర్భాటం చేసి ఏమీ చేయలేర‌ని, ఎమ్మెల్యేగా గెల‌వాలని సవాల్ విసిరారు.


Next Story