ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇళ్లు దెబ్బతిన్నాయని వారికి పార్టీ తరపున లక్ష రూపాయలు పవన్ అందజేస్తానని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మళ్లీ ఇళ్లు నిర్మించుకునేందుకు ఈ సాయం అందిస్తున్నామని తెలిపారు.
ఇటీవల గ్రామంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే. కొందరు రైతులు బహిరంగ సభకు స్థలం ఇచ్చారని అందుకే ప్రభుత్వం గ్రామాన్ని కూల్చివేస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇకనైనా కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం మానుకోవాలని కోరారు.