పవన్ కళ్యాణ్ అప్పుల లిస్టు ఇదే..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను వెల్లడించారు
By Medi Samrat Published on 24 April 2024 6:15 AM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆయన ఐదేళ్ల సంపాదన రూ.114.76 కోట్లు కాగా.. ప్రభుత్వానికిచెల్లించిన పన్నులు రూ.73.92 కోట్లని తెలిపారు. అలాగే అప్పులు రూ. 64. 26 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక రూ. 20 కోట్లు విరాళాలు అందించారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ కి అప్పులు రూ.64,26,84,453 ఉన్నాయని.. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46 కోట్ల 70 లక్షలు ఉన్నాయని అందులో తెలిపారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చాలా మంది నిర్మాతల నుండి అడ్వాన్స్‌లు తీసుకుని కొన్ని సినిమాలను కూడా మొదలుపెట్టారు. AM రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న హరి హర వీర మల్లు, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఉస్తాద్ భగత్ సింగ్, DVV దానయ్య నిర్మాతగా #OG సినిమాలు ఉన్నాయి. అయితే ఈ నిర్మాతలు చెల్లించిన చాలా అడ్వాన్స్‌లు.. రుణాలుగా జాబితా చేశారు.
జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి తరపున పిఠాపురం ఎమ్మెల్యే గా నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్ సమర్పించిన అఫిడవిట్‌లో పలువురు వ్యక్తులు, కంపెనీలకు తాను చెల్లించాల్సిన రుణాల జాబితాను పంచుకున్నారు. ఈ జాబితాలో హారిక హాసిని క్రియేషన్స్, రామ్ తాళ్లూరి కి చెందిన లీడ్ ఐటి సొల్యూషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన మైత్రి నవీన్, శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్స్, డివివి దానయ్య ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కు రుణదాత లిస్టులో మెగా సోదరుడు మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ ఉన్నారు. ఆయనకు 2 కోట్లు ఇచ్చారు.