రూ.6 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు

By Medi Samrat
Published on : 4 Sept 2024 12:55 PM

రూ.6 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆ కోటి రూపాయలకు అదనంగా మరో ఐదు కోట్ల విరాళం ప్రకటించారు. వరద ముంపు బారిన పడ్డ 400 గ్రామ పంచాయతీలకు రూ. లక్ష చొప్పున రూ.4 కోట్లు వ్యక్తిగతంగా విరాళం ప్రకటించారు. ఈ నిధులను నేరుగా పంచాయతీ ఖాతాలకు పంపిస్తానని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ తెలియచేస్తారని.. ఆ ప్రకారం వరద ముంపుతో ఉన్న పంచాయతీలకు విరాళాలు పంపిస్తాను అన్నారు. అలాగే తెలంగాణ వరద బాధితులకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందజేస్తానని చెప్పారు.

ఉద్యోగుల భూరి విరాళం

పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు వరద బాధితులకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయనిధికి తమ ఒక్క రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ పవన్ కళ్యాణ్ ను కలిసి 1.64 లక్షల మంది ఉద్యోగుల ఒక్క రోజు మూల వేతనం రూ. 14 కోట్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం రూ. 75 లక్షలు, గ్రామీణ నీటి పారుదల శాఖ ఉద్యోగులు రూ. 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటిస్తున్నట్లు లేఖలు అందచేశారు. ఉద్యోగులను ఉప ముఖ్యమంత్రి అభినందించారు.

Next Story