ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ప్రమాదం గురించి ఈరోజు ఉదయం కాల్ వచ్చిందని, మొదట చిన్న ప్రమాదం అనుకున్నానని తర్వాత పెద్ద ప్రమాదమే అని తెలిసిందన్నారు. చేతికి, కాలికి గాయాలు అయ్యాయని, నా కుమారుడు పక్కనే కూర్చున్న స్టూడెంట్ కి తీవ్ర గాయాలు అయ్యాయన్నారు పవన్ కళ్యాణ్. ఈ ఘటన గురించి ప్రధాని మోదీ కాల్ చేశారని, సింగపూర్ హై కమీషన్ తో కూడా మోదీ మాట్లాడారని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు ఫోన్ చేసిన వారందరికీ ధన్యవాదాలని అన్నారు పవన్ కళ్యాణ్. అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. నా పెద్ద కొడుకు అకీరా పుట్టిన రోజు నేడని, ఇదే రోజు ఇలా జరగడం దురదృష్టకరమన్నారు పవన్ కళ్యాణ్.