ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన రోడ్‌షోలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన వాహనంపై లేచి నిలబడి అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేయడం ప్రారంభించారు. ఇంతలో ఓ అభిమాని అకస్మాత్తుగా వాహనంపైకి రావడంతో వేగంగా దూసుకెళ్లి పవన్‌ను ఢీ కొట్టాడు. దాంతో పవన్ ఒక్కసారిగా పడిపోయాడు. అయితే కారుపై చతికిలబడడంతో పవన్ కల్యాణ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తర్వాత లేచి యధావిధిగా లేచి పవన్ మాట్లాడారు. ఇంతలో రోడ్‌షో సమయంలో ఒక యువతి కారు బయోనెట్‌పైకి ఎక్కి తన అభిమాన తారకు హారతి ఇచ్చింది. మత్స్యకారుల సభలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ నరసాపురం వచ్చారు.
అక్కడి నుండి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని... నరసాపురం చేరుకునే వరకు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలతో సహా హోరాహోరీగా రోడ్ షో సాగింది. అంతకుముందు మత్స్యకార అభ్యున్నతి సభకు హాజరయ్యేందుకు జనసేన అధినేత రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి నరసాపురానికి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో బయలు దేరారు. రావులపాలెం, సిద్దాంతం, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుకున్నారు.