అన్నప్రాసన రోజు కత్తి పట్టిన పరిటాల రవి మనవడు.. పరిటాల శ్రీరామ్ షాకింగ్ రియాక్షన్
Paritala Sriram Son Ravindra. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కుమారుడు రవీంద్ర(తన తండ్రి పేరునే కొడుకుకు పెట్టారు)కు
By Medi Samrat Published on
24 April 2021 11:12 AM GMT

టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కుమారుడు రవీంద్ర(తన తండ్రి పేరునే కొడుకుకు పెట్టారు)కు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులతో పాటు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చిన్నారి రవీంద్ర ముందు పుస్తకాలు, డబ్బులు, ఇతర వస్తువులతో పాటు ఓ కత్తిని కూడా ఉంచారు.
అన్ని వస్తువులను వదిలేసిన రవీంద్ర కత్తిని పట్టుకున్నాడు. పరిటాల శ్రీరామ్ కాసేపు తల పట్టుకున్నారు. ఆ సన్నివేశాన్ని చూసి అందరూ నవ్వుకున్నారు. అన్నప్రాసనకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. పరిటాల శ్రీరామ్ తల పట్టుకున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది.
పరిటాల శ్రీరామ్ సతీమణి జ్ఞాన నవంబర్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది.. పరిటాల శ్రీరామ్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు.
Next Story