అనంతపురం జిల్లాలో రెవెన్యూ అధికారుల తీరుపై మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు ఆమె భూమికి సంబంధించిన రికార్డులను రెవెన్యూ అధికారులు మార్చేశారంటూ ఆరోపించారు. కనగానపల్లి మండలం నర్సంపల్లి గ్రామంలో పరిటాల సునీత పేరుతో ఉన్న 26 ఎకరాల భూమికి రెవెన్యూ అధికారులు రెడ్ మార్క్ వేశారు. ఆన్ లైన్‌లో కనిపించకపోవడంతో భూమికి సంబంధించిన వివరాలను పరిటాల కుటుంబం ఆరా తీసింది.
దీంతో రెవెన్యూ అధికారుల మాయాజాలం బయటపడింది. రెడ్ మార్క్ వేసిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సునీత తీసుకెళ్లారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో రికార్డులను కనగానపల్లి రెవెన్యూ అధికారులు సరిచేశారు. మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉంటే.. ఇతరుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.