ఏపీలో మొదలైన 'ఆపరేషన్ స్వర్ణ'
స్వర్ణముఖి నది పరిరక్షణకు ఆపరేషన్ స్వర్ణ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు.
By - Medi Samrat |
స్వర్ణముఖి నది పరిరక్షణకు ఆపరేషన్ స్వర్ణ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు. తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్వర్ణముఖి నదిని ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాల తొలగింపుపై అధికారులు దృష్టి పెట్టారని తెలిపారు. చంద్రగిరి నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిని రక్షించడమే ఆపరేషన్ స్వర్ణ ముఖ్య ఉద్దేశమని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణదారులను స్వచ్ఛందంగా తొలగించేందుకు 45 నుంచి ౬౦ రోజుల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. నది పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న అర్హులైన పేదలను గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున ఇళ్లు కేటాయించేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హామి ఇచ్చారు.
స్వర్ణముఖి నదిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నదిని ఆక్రమించి పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. 'ఆపరేషన్ స్వర్ణముఖి' పేరుతో ఆక్రమణలను తొలగిస్తామని చెప్పిన నాయకులు, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలను పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి.