ఏపీలో వైన్ షాప్స్ తెరిచే సమయాలు ఇవే.!

ఆంధ్రప్రదేశ్ లోని మందుబాబులకు గుడ్ న్యూస్. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లిక్కర్ షాపులను తెరిచి ఉంచనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది

By Medi Samrat  Published on  19 Sept 2024 4:12 PM IST
ఏపీలో వైన్ షాప్స్ తెరిచే సమయాలు ఇవే.!

ఆంధ్రప్రదేశ్ లోని మందుబాబులకు గుడ్ న్యూస్. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లిక్కర్ షాపులను తెరిచి ఉంచనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త మద్యం పాలసీ ప్రకారం తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందించనున్నారు. రాష్ట్రంలో అన్ని రకాల మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వైన్స్ షాపుల కేటాయింపులో లాటరీ విధానం అవలంబించనున్నారు. రెండేళ్ల కాల పరిమితితో లైసెన్సులు జారీ చేయనున్నారు. షాపు లైసెన్స్ కోసం రూ.2 లక్షలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాటరీ పద్ధతిలో లైసెన్స్ దక్కినా దక్కకున్నా ఈ మొత్తం నాన్ రిఫండబుల్ అని ప్రభుత్వం తెలిపింది. గీత కార్మికులకు వైన్స్ షాప్ లైసెన్సులలో 10 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం బుధవారం కొత్త మద్యం పాలసీకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సగటు మద్యం ధర రూ.99 ఉండాలని నిర్ణయించింది. గతంలో మంత్రివర్గ ఉపసంఘం సూచించినట్లుగా అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి రానుంది.

Next Story