అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ అనుమతులపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్, గ్రామాల్లోని పేద, మధ్య తరగతి ప్రజలకు రూపాయికే పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50 చదరపు గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి ఫీజ్ నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పేద మధ్యతరగతి వర్గాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఒక రూపాయి ఫీజు వసూలు చేయాలని ఆదేశించింది.
కాగా గతంలో ఇంటి నిర్మాణ ఫీజు 3 వేల రూపాయలుగా ఉండేది. ప్రస్తుతం ఇంటి నిర్మాణం డాక్యుమెంట్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి. రూపాయి ఫీజ్ చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో సామాన్య ప్రజలపై 6 కోట్లకు పైగా తగ్గనున్న భారం తగ్గనుందని ప్రభుత్వం తెలిపింది.