మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్.. వెంకట చంద్రబాబుకు సాయం

Once Again CM Jagan has shown a Good Heart. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు.

By Medi Samrat
Published on : 24 May 2023 9:00 AM IST

మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్.. వెంకట చంద్రబాబుకు సాయం

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. అనారోగ్య సమస్యలతో తన దగ్గకు వచ్చిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సీఎం జగన్ గంటల వ్యవధిలోనే ఆర్థిక సాయం అందించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల కోసం సీఎం జగన్‌ బందరు వచ్చారు. తిరుగు ప్రయాణంలో భాగంగా స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ దగ్గరకు గోపాల నాగ వెంకట చంద్రబాబు అనే వ్యక్తి వచ్చాడు. మచిలీపట్నం 34 వ డివిజన్ వర్రె గూడెంకు చెందిన ఆయన వీపు వెనక ఒక పెద్ద క్యాన్సర్‌ కణితి వచ్చింది. చికిత్సలో భాగంగా పాడైపోయిన అతని కిడ్నీని వైద్యులు తొలగించారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో తన కుటుంబాన్ని ఆదుకోవాలని, వైద్య చికిత్సకు సాయం చేయాలని సీఎం జగన్‌ ను అభ్యర్థించారు. బాధితుడి పరిస్థితి చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి అర్జీని, మెడికల్ రిపోర్ట్స్‌ను చదివి వెంటనే రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి తక్షణమే డబ్బులు అందేలా కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబును సీఎం జగన్‌ ఆదేశించారు. మంగళవారం ఉదయం గోపాల్‌కు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. జిల్లా కలెక్టర్‌ రాజబాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్నినాని చేతుల మీదుగా బాధితునికి చెక్కును అందజేశారు.


Next Story