శ్రీకాకుళంలో దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వ్యక్తికి కరోనా.. అందరిలోనూ టెన్షన్

Omicron Tension In Srikakulam District. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్

By Medi Samrat  Published on  7 Dec 2021 12:52 PM GMT
శ్రీకాకుళంలో దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వ్యక్తికి కరోనా.. అందరిలోనూ టెన్షన్

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కేసు వచ్చిందనే వార్త ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. సంత బొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బాధితుడు ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి జిల్లాకు వచ్చాడు. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. ఉమిలాడ గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. తిరిగి 14 రోజుల అనంతరం మళ్లీ కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించగా, మళ్లీ కరోనా పాజిటివ్ రావడంతో హుటాహుటీన శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు.. ఒమిక్రాన్ అనుమానంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అతనికి లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ ను రిమ్స్ మెడికల్ కాలేజీకి పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తర్వాత గానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. కరోనా బాధితుడు గత నెల 23వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు సమాచారం. అతను వచ్చిన వెంటనే టెస్టు చేసినప్పటికీ నెగెటివ్ వచ్చింది. మళ్లీ ఆయన అనారోగ్యానికి గురయ్యారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన నేపథ్యంలో అతని శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపారు. జిల్లా వాసులు ఎటువంటి భయాందోళనలో పడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాధం స్పష్టం చేశారు. ఆ వ్యక్తికి రెండు సార్లు కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చేసామని.. రక్త నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కి పంపించామని తెలిపారు. అయితే ఇంకా ఒమిక్రాన్ నిర్ధారించలేదని తెలిపారు.


Next Story