ఏపీలో వృద్ధాప్య పింఛను రూ.2,750కి పెంపు.. ఎప్పటినుంచంటే?

Old age pension in AP will be increased to Rs 2,750 from next January. సీఎం అయిన తర్వాత తొలిసారి నేడు సీఎం వైఎస్‌ జగన్‌ కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా కుప్ప నియోజకవర్గంలో

By అంజి  Published on  23 Sep 2022 11:13 AM GMT
ఏపీలో వృద్ధాప్య పింఛను రూ.2,750కి పెంపు.. ఎప్పటినుంచంటే?

సీఎం అయిన తర్వాత తొలిసారి నేడు సీఎం వైఎస్‌ జగన్‌ కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా కుప్ప నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే ఎస్సీ వర్గాలకు చెందిన నిరుపేద మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ఉద్దేశించిన వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వరుసగా మూడో ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 26.39 లక్షల మంది మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.4,949.44 కోట్లు జమ చేశారు.

అమినిగానిపల్లిలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 33 ఏళ్లుగా వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, తన సొంత కుప్పం నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత ఎన్. చంద్రబాబు నాయుడుపై జగన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "చంద్రబాబు కుప్పాన్ని శాసనసభ్యుని కావడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు" అని ఆయన నిందించారు. చంద్రబాబు కుప్పం స్థానికేతరుడు, హైదరాబాద్‌కు స్థానికుడు అని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌ను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన సీఎం వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు. వచ్చే జనవరి నుంచి వృద్ధాప్య పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాల గణాంకాలను వైఎస్‌ జగన్‌ తెలియజేస్తూ మూడేళ్లలో చేయూత ద్వారా రూ.14,110 కోట్లు, అమ్మఒడి ద్వారా 44.50 లక్షల మందికి రూ.19,617 కోట్లు, అమ్మఒడి ద్వారా 78.74 లక్షల మందికి రూ.12,758 కోట్లు అందించామన్నారు. ఆసరా, సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇచ్చారు. ఎలాంటి అవినీతి, వివక్షకు తావు లేకుండా ఒక బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. గత పాలనకు, ప్రస్తుత పాలనకు తేడా ఏమిటో మహిళలు ఆలోచించాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా కోరారు.


Next Story