అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
By - Knakam Karthik |
అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు గ్రామాలలో 16 వేల 666.57 ఎకరాల పట్టా, అసైన్డ్ భూమి సమీకరణ చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. భూ సమీకరణ బాధ్యతను సీఆర్ డీఎ కమిషనర్ కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను చేపట్టాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు.
వైకుంఠపురం లో 1965 ఎకరాలు, పెదమద్దూరు లో 1018 ఎకరాల పట్టా భూముల భూ సమీకరణ, యండ్రాయ్ గ్రామ పరిధిలో 1879 ఎకరాలు పట్టా , 46 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సమీకరణ, కర్లపూడి లేమల్లే 2603 ఎకరాలు పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ భూ సమీకరణ, గుంటూరు జిల్లాలో తుల్లూరు మండలంలో 3 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వడ్డమాను లో 1763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 అసైన్డ్ ల్యాండ్ సమీకరణ, హరిశ్చంద్రాపురం లో 1448.09 ఎకరాలు పట్టా, 2.29 అసైన్డ్ ల్యాండ్ సమీకరణ, పెదపరిమి లో 5886.18 ఎకరాల పట్టా భూమి సమీకరణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
7 గ్రామాల్లో కలిపి పట్టాభూమి 16562.52 ఎకరాలు , అసైన్డ్ భూమి 104.01 ఎకరాలు సమీకరణ చేయనున్నారు. దీంతో 7 గ్రామాల పరిధిలో సమీకరణతో 3828.30 ప్రభుత్వ భూమి అందుబాటులోకి రానుంది. రెండో విడత భూ సమీకరణతో ప్రభుత్వ భూమితో కలిపి 20 వేల 494 ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది.