ద‌ళిత యువ‌కుడి శిరోముండనం కేసుతో పాటు పలు కేసుల్లో అరెస్టైన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నూతన్‌నాయుడుకు బెయిల్ ల‌భించింది. దీంతో నూతన్‌నాయుడు బుధ‌వారం విశాఖ‌ సెంట్ర‌ల్ జైలు నుంచి విడుద‌లై బయటకు వచ్చాడు.

ఇదిలావుంటే.. ఏపీలో సంచలనం సృష్టించిన దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు ఏ8గా ఉన్నాడు. అయితే.. అతడు దేశం విడిచి పారిపోతుండగా.. సెప్టెంబరు 3న బెంగుళూరు ఉడుపిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత కూడా నూతన్ నాయుడు మోసాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.

ఉద్యోగాల పేరుతో మోసం చేయడం, ఉన్నతాధికారి పేరుతో పలువురికి కాల్స్ చేసినట్టు నూతన్ నాయుడు పై అభియోగాలు వచ్చాయి. ఈ క్రమంలో అతడిపై ప‌లు కేసులు నమోదు అయ్యాయి. పెందుర్తి, గోపాలపట్నం, కంచరపాలెం, గాజువాక, మహారాణిపేట పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. మరోవైపు శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు భార్య సహా మిగిలిన ఏడుగురు కొద్దిరోజుల క్రితం బెయిల్‌పై విడుద‌ల కాగా.. దాదాపు 70 రోజుల జైలు జీవితం అనంత‌రం నూతన్‌ నాయుడు నేడు విడుద‌ల‌య్యాడు.


సామ్రాట్

Next Story