ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్(ASHA) ప్రకటించింది. అన్ని అస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు ఇప్పటి వరకూ కానసొగించామని, రూ.2,000 కోట్ల వరకూ చెల్లించాలని కోరింది. పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆస్పత్రుల నెలవారీ నిర్వహణను చేయలేకపోతున్నామని, బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరింది. ఇప్పటికే సామర్థానికి మించి సేవలు అందించామని, బకాయిలు ఇవ్వలేని నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని కొనసాగించలేమని స్పష్టం చేసింది.