Andhrapradesh: ప్రభుత్వాసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
ప్రభుత్వ ఆసుత్రుల్లో డాక్టర్ల పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
By అంజి Published on 3 Dec 2024 1:08 AM GMTAndhrapradesh: ప్రభుత్వాసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ
ప్రభుత్వ ఆసుత్రుల్లో డాక్టర్ల పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో రెగ్యులర్ ప్రాతిపదికన జరిగే నియామకాలతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా కలిసి ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం, ఎంపికైన వారిని పీహెచ్‌సీలు/ఇతర వైద్య సంస్థల్లో నియమిస్తారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. http:apmsrb.ap.gov.in/msrb/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం ఉంటుంది, డిసెంబర్ 4 నుంచి 13 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.
సెకండరీ ఆసుపత్రుల్లో మరో 97 డాక్టర్ పోస్టుల భర్తీ
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) పరిధిలో 97 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్/సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్) ఖాళీల కోసం మరో నోటిఫికేషన్ జారీ అయింది. వీటిలోనూ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పోస్టులు కలిసి ఉన్నాయి. అర్హతలు, మార్గదర్శకాలు http://apmsrb.ap.gov.in/msrb/, https://hmfw.ap.gov.in, https://cfw.ap.nic.in వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి. అర్హతలు, వివరణాత్మక మార్గదర్శకాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు ఫారం కూడా ఆన్‌లైన్‌లో ఉంటుంది, డిసెంబర్ 4 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.