టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు.

By అంజి  Published on  27 Oct 2023 9:50 AM IST
TTD, job Notification, Tirumala, APnews

టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. శాశ్వత ప్రతిపాదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ రిలీజియన్‌కు చెందిన వారు ఈ పోస్టులకు అర్హులని టీటీడీ పేర్కొంది. తగిన విద్యార్హతలు ఉండి, ఇంట్రెస్ట్‌ ఉన్న వారు నవంబర్‌ 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 56 ఉద్యోగాలు ఉండగా, అందులో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్) పోస్టులు 27 ఉన్నాయి. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్) 10, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (సివిల్‌) 19 పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానికల్‌), ఎల్‌సీఈ, ఎల్ఎంఈ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 42 ఏళ్లు మించరాదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏఈఈల నెల వేతనం రూ.57 వేల నుంచి రూ.లక్షా 47 వేలు ఉంటుంది. ఏఈల వేతనం నెలకు రూ.48 వేల నుంచి రూ.లక్షా 37 వేలు ఉంటుంది. ఏటీల నెల వేతనం రూ.37 వేల నుంచి రూ.లక్షా 15 వరకు ఉంటుందని టీటీడీ తెలిపింది.

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


Next Story