గుడ్ న్యూస్.. ఏపీలో 488 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది

By Medi Samrat  Published on  23 Aug 2024 6:45 PM IST
గుడ్ న్యూస్.. ఏపీలో 488 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేశారు. డైరెక్ట్ , లేటరల్ ఎంట్రీ ద్వారా శాశ్వత ప్రాతిపదికన బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు 23-08-2024 నుండి 09-09-2024 లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకోసం https://dme.ap.nic.in https://apmsrb.ap.gov.in/msrb/ వెబ్సైట్ ను సంప్రదించండి.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 488 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ రావడంతో ఇక నిరుద్యోగులు ప్రిపరేషన్ ను మొదలు పెట్టనున్నారు.

Next Story