పార్టీలో ఎలాంటి అసంతృప్తులు లేవు : మాజీ మంత్రి

No disgruntlement in Nellore YSRCP. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన జగనన్న మాట‌ - గడపగడపకూ బాట

By Medi Samrat  Published on  15 April 2022 2:20 PM IST
పార్టీలో ఎలాంటి అసంతృప్తులు లేవు : మాజీ మంత్రి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన జగనన్న మాట‌ - గడపగడపకూ బాట కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ సంఘీభావం తెలిపారు. గురువారం రూరల్ పరిధిలోని సజ్జాపురంలో శ్రీధర్ రెడ్డి పాదయాత్ర చేప‌ట్ట‌గా.. మధ్యాహ్న విరామ సమయంలో అనిల్ కుమార్ యాదవ్ ఆయనను కలిశారు.

ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాద‌వ్‌ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అసంతృప్తులు లేవని, వైఎస్సార్సీపీలో ఉన్నవారంతా వైఎస్ జగన్ సైనికులేనని అన్నారు. జగనన్న మాట - గడపగడపకూ బాట కార్యక్రమం ద్వారా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు మరింత చేరువవుతున్నారన్నారు. నెల్లూరు రూరల్ నుంచి అత్యధిక మెజార్టీతో కోటంరెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఉన్నారు.










Next Story