వర్ల రామయ్య రాసిన లేఖపై స్పందించిన ఎన్‌హెచ్ఆర్సీ
మైనింగ్ వ్యవహారంలో వర్ల రాసిన లేఖపై విచారణకు ఆదేశం
అమరావతి: కొండపల్లి మైనింగ్‌పై టీడీపీ నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాసిన లేఖపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. కొండపల్లి మైనింగ్ వ్యవహారంలో వర్ల రాసిన లేఖపై విచారణకు ఆదేశించింది. వర్ల ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి స్పష్టం చేసింది. చేపట్టిన చర్యలపై 8 వారాల్లోగా ఫిర్యాదు చెప్పాలని లా రిజిస్ట్రార్‌కు సూచించింది. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ గత నెల 8వ తేదీన వర్ల రామయ్య జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు.
ఇటీవల కొండపల్లిలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ వ్యాపారం సాగుతుతోందంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రావెల్ మైనింగ్ వివాదాలకు కారణమవుతోంది. దీనిపై వైసీపీ, టీడీపీ నేతలు ఎన్నడూలేనంతగా బహాబహీని ప్రదర్శిస్తున్నారు.