All Party Meeting : ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిన వైసీపీ... మౌనంగా ఉన్న టీడీపీ నేత‌లు

All Party Meeting In Parliament Over Monsoon Session

By Medi Samrat
Published on : 21 July 2024 1:02 PM IST

All Party Meeting : ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిన వైసీపీ... మౌనంగా ఉన్న టీడీపీ నేత‌లు

పార్లమెంట్‌లోని ప్రధాన కమిటీ రూమ్‌, పార్లమెంట్‌ హౌస్‌ అనెక్స్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్‌ కార్యకలాపాలకు ఏకాభిప్రాయం కల్పించే అంశంపై ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి ప్రమోద్ తివారీ, గౌరవ్ గొగోయ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ నేత అన్నారు. అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయడంతోపాటు నీట్‌ అంశాన్ని కూడా లేవనెత్తిందని తెలిపారు.

బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్ చేసిందని జైరాం రమేష్ పేర్కొన్నారు. అధికార ఎన్డీయేలో కీలక మిత్రపక్షమైన జేడీ(యూ).. ఇటీవల బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటులో మాట్లాడేందుకు అనుమతించాలని ఆర్జేడీ ఎంపీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ నీట్-యూజీ అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్వార్ మార్గ్‌లోని ఆహార పదార్థాల దుకాణాలపై నేమ్‌ప్లేట్ల సమస్యను సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ లేవనెత్తారు.

Next Story