ఏపీలో 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లు నియామకం

ఏపీలో 11 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాయింట్ కలెక్టర్లు నియమించింది

By -  Knakam Karthik
Published on : 13 Jan 2026 9:52 AM IST

Andrapradesh, Amaravati, CM Chandrababu, New Joint Collectors appointed

ఏపీలో 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లు నియామకం

అమరావతి: ఏపీలో 11 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాయింట్ కలెక్టర్లు నియమించింది. ఈ జాబితాలో తాజాగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలు కూడా ఉన్నాయి. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న పి. శ్రీనివాసులును మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గొబ్బిళ్ల విధ్యాధరిని విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా నియమించగా, అన్నమయ్య జిల్లా జేసీగా ఉన్న ఆదర్శ రాజేంద్రన్‌ను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.

సివిల్ సప్లయిస్ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆర్. గోవిందరావును బదిలీ చేసి తిరుపతిలోని టుడా వైస్ చైర్మన్‌గా నియమించడంతో పాటు తిరుపతి జాయింట్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రకాశం జిల్లా జేసీగా ఉన్న గోపాల్ కృష్ణ రోణంకిని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఖాళీగా ఉన్న పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వి. సంజన సింహాను ప్రభుత్వం నియమించింది. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న బచ్చు స్మరణ్ రాజ్‌కు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story