కాసేపట్లో కోర్టుకు నారా లోకేష్..
Nara Lokesh to Attend Court Today. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరి కాసేపట్లో కోర్టుకు
By Medi Samrat Published on
23 May 2022 5:16 AM GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరి కాసేపట్లో కోర్టుకు హాజరు కానున్నారు. పార్టీ ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వ్యక్తిగతంగా హజరవ్వాలని విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మెజిస్ట్రేట్ ఎదుట నారా లోకేష్ హాజరుకానున్నారు. లోకేష్ కోర్టుకు రానున్న నేఫథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. కోర్టు వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Next Story