నారా లోకేష్‌కు క‌రోనా పాజిటివ్

Nara Lokesh Tested For Covid Positive. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యుడి నుండి

By Medi Samrat
Published on : 17 Jan 2022 4:10 PM IST

నారా లోకేష్‌కు క‌రోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యుడి నుండి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకు ఎవ‌రిని వ‌ద‌ల‌ట్లేదు. కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో థ‌ర్డ్‌ వేవ్ ముప్పును చూపిస్తున్న నేఫ‌థ్యంలో చేపట్టాల్సిన చర్యల విష‌య‌మై ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో చాలా మంది రాజకీయ నేతలకు కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. కాగా, సోమవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు.

నారా లోకేష్ తన ట్విట్‌లో.. నాకు కొవిడ్‌ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. స్వ‌ల్ప‌ లక్షణాలు ఉన్న‌ప్ప‌టికీ నేను బాగానే ఉన్నాను. కోలుకునే వరకు ఐసోలేష‌న్‌లో ఉంటాను. ఈ మ‌ధ్య తనను క‌లిసిన వారు వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ లోకేష్ తన ట్వీట్‌ను ముగించారు. అంత‌కుముందు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో విద్యార్థులు నష్టపోతారని లేఖ‌లో పేర్కొన్నారు.


Next Story