ఆర్టీసీ ఛార్జీలు పెంపు : జగన్ మోసపు రెడ్డి అంటూ లోకేష్ విమ‌ర్శ‌లు

Nara Lokesh Slams YS Jagan Over RTC Charges Hike. ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై ట్విట‌ర్ వేదిక‌గా సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ జాతీయ ప్రధాన

By Medi Samrat  Published on  1 July 2022 9:20 AM GMT
ఆర్టీసీ ఛార్జీలు పెంపు : జగన్ మోసపు రెడ్డి అంటూ లోకేష్ విమ‌ర్శ‌లు

ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై ట్విట‌ర్ వేదిక‌గా సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడికి కులం, మతం, ప్రాంతం లేదని.. 2 నెలలు కాకముందే డీజిల్ సెస్‍పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై భారం మోపడమేన‌ని అభిప్రాయప‌డ్డారు. పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ లో రూ.90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంచారని పెంచార‌ని ఫైర్ అయ్యారు.

రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా వైసీపీ ప్రభుత్వం డీజిల్ సెస్ పేరుతో రూ.500 కోట్లు పేదల నుంచి కొట్టేస్తుందని ఆరోపించారు. ఆఖరికి విద్యార్థుల బస్ పాస్‍లను కూడా వదలకుండా బాదేయడం దారుణమ‌ని విమ‌ర్శించారు. ఆర్టీసీ రూపురేఖలు మార్చేస్తానన్న జగన్‍మోసపురెడ్డి.. సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని అన్నారు. ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకు దూరం చేస్తున్నారని నారా లోకేశ్ మండిప‌డ్డారు.











Next Story