నారా లోకేష్.. త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నారా..?

Nara Lokesh Getting Ready For Padayatra in AP. తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడు భారీగా సక్సెస్ అయింది.

By Medi Samrat
Published on : 30 May 2022 1:15 PM IST

నారా లోకేష్.. త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నారా..?

తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడు భారీగా సక్సెస్ అయింది. తప్పులను తెలుసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు టీడీపీ అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించేసింది. కేడర్ ను మరింత పటిష్టం చేయడానికి టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ పాదయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే దీనిపై పార్టీ అధిష్టానం నుండి ప్రకటన రావాల్సి ఉంది. నారా లోకేష్ త్వరలోనే పాదయాత్ర చేపడతారంటూ టీడీపీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి.

మహానాడు ఇచ్చిన జోష్ తో నారా లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. 2024లో 'క్విట్ జగన్.. సేవ్ ఏపీ' అనే నినాదంతో ముందుకెళ్తామని చంద్రబాబు చెప్పడంతో.. అదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా లోకేష్ పాదయాత్ర చేసి టీడీపీ క్యాడర్ కు మరింత దగ్గరవుతారనే టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి గ‌తంలో "మీ కోసం" పేరుతో చంద్ర‌బాబునాయుడు 2014 ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ యాత్ర ఆయ‌న్ను అధికారంలోకి తెచ్చింది. ఇప్పుడు టీడీపీ కోసం నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం ముమ్మరమవుతోంది.










Next Story