టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తారా లేదా: నారా లోకేష్

Nara Lokesh Fire On AP Govt. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్న

By Medi Samrat  Published on  22 May 2021 5:42 AM GMT
టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తారా లేదా: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇతర రాష్ట్రాలలో పరీక్షలను రద్దు చేసి మార్కులను కూడా అందించారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేవలం వాయిదా మాత్రమే వేశారు. అయితే ఈ పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ డిమాండ్ చేస్తూ ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా ఉధృతిని అడ్డుకోవడంలో విఫలమైందని.. రాష్ట్రంలో పాఠశాలలు ఓపెన్ చేయడం ద్వారా కరోనా వేగంగా వ్యాపించిందని విమర్శించారు. ఎంతోమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులను కోల్పోయారని అన్నారు. ఇప్పుడు పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అనుకోవడం సరైన నిర్ణయం కాదని నారా లోకేష్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో 15 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటారు. 30 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొంటారన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరూ కలిపి 80 లక్షల మందికి కరోనా వచ్చే అవకాశం ఉందని అన్నారు. పరీక్షల నిర్వహణ ద్వారా వీరంతా సూపర్ స్ప్రెడర్లుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

9 రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు. పక్కనున్న తెలంగాణలో పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేశారనే విషయాన్ని నారా లోకేష్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని నారా లోకేష్ కోరారు. గతంలో మా పోరాటం ద్వారా పరీక్షలను వాయిదా వేశారని.. వాయిదా వేయడం కంటే పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.


Next Story