ఆరోపణలను నిరూపించండి : వైసీపీకి లోకేష్ సవాల్

Nara Lokesh challenges YSRCP to prove the allegations on AP Skill Development scam. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పథకంలో తనపై ఆరోపణలను నారా లోకేష్ ఖండించారు.

By Medi Samrat
Published on : 6 Dec 2022 9:17 PM IST

ఆరోపణలను నిరూపించండి : వైసీపీకి లోకేష్ సవాల్

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పథకంలో తనపై వ‌స్తున్న‌ ఆరోపణలను నారా లోకేష్ ఖండించారు. ఆరోప‌ణ‌లను ఋజువు చేయాల‌ని వైఎస్సార్సీపీకి టీడీపీ నేత నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తనపై వైసీపీ చేస్తున్న ఆరోపణలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమని లోకేష్ ట్వీట్ చేశారు. ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నానని, వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలు బయటపెడతారా.. పారిపోతారా అంటూ ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌లపై వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలతో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై దుమారం రేగుతోంది. మరోవైపు ఈ కుంభకోణంలో 26 మంది సభ్యులకు నోటీసులు ఇచ్చారు.



Next Story